APWJF NEWS
APWJF ANDOLANA
Wed, 25 Sep 2013 16:55:00 +0000


ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ పై అక్రమ కేసుకు నిరసనగా రేపు APWJF రాష్ట్ర వ్యాప్త ఆంధోళన

గవర్నర్ కు వినతిపత్రం

ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ పై అక్రమ కేసుకు నిరసనగా ఆందోళనకు APWJF పిలుపు నిచ్చింది. గురువారం 26 సెప్టెంబర్ 2013 రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని APWJF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.బసవ పున్నయ్య, జి.ఆంజనేయులు పిలుపునిచ్చారు. అక్రమ కేసును బనాయించటంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేదింపులకు గురిచేయటాన్ని నిరసించాలని కోరారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర రాజదాని హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 21 న APWJF, HUJ భారీ ధర్నా చేపట్టాయని వివరించారు. ఈ నెల 23 న సుందరయ్య విజాఞ్ న కేంద్రంలో తెలుగు, ఆంగ్ల దినపత్రికల సంపాదకులు, ఎలక్ట్రానిక్ మీడియా సిఈఓల తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ సంధర్భంగా సంపాదకులు డిజిపి దినేష్ రెడ్డి వ్యవహారాన్ని తప్పుబట్టారని, ప్రభుత్వం వెంటనే అతనిని తొలగించాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఈ నేపద్యంలో అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని APWJF జిల్లా శాఖలకు సూచించారు. విచారణ పేర హిందూ ఎడిటర్ ను పదే పదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పిలవటాన్ని ఖండించారు. 135 యేళ్ళ చరిత్ర కల్గిన హిందూ పత్రిక ఎడిటర్ ను లొంగదీసుకోవాలనే బ్రమల్లో పోలీసులు ఉన్నారని, ఇది సాద్యం కాదని అన్నారు. రాష్ట్ర డిజిపి మూడనమ్మకాలను ప్రోత్సహించేలా వ్యవహరించారని, ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతోందని అన్నారు. అలాగే అన్ని పత్రికల ఎడిటర్లు, చానెళ్ళ సిఈఓ ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్ నరసింహన్ కు సమర్పిస్తామని చెప్పారు. పోలీసు కేసులతో జర్నలిస్టులను, పత్రికలను బయపెట్టాలని , లొంగదీసుకోవాలనుకోవటం ఆత్మహత్యా సదృష్యమేనని అన్నారు. వెంటనే డిజిపికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

GROUP MEDI CLAIM POLICY FOR WORKING JOURNALISTS
Sat, 24 Aug 2013 14:50:00 +0000

ప్రభుత్వంతో APWJFచర్చలు సఫలం... మెడిక్లెయిం పునరుద్దరణ.

 

జర్నలిస్టుల మెడిక్లెయిమ్ పాలసీ ధరఖాస్తుల గడువు ఆగస్టు28


జర్నలిస్టుల ఆరోగ్యభీమాకు ఉద్దేశించిన మెడిక్లెయిమ్ పాలసీ పొడిగింపు పై రాష్ట్ర ప్రభుత్వంతో APWJF జరిపిన చర్చలు సపలం అయ్యాయి.  ఈ మేరకు మెడిక్లెయిం ను పునరుద్దరిస్తూ సమాచార కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14 సంవత్సరానికి గాను పాలసీ రెన్యువల్/ కొత్తగా చేరే జర్నలిస్టులు తమ వాటాధనం 900/-రూపాయలు ఆగస్టు 28 వతేదీలోగా చెల్లించాలని APWJF కోరుతుంది.. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, నేషనల్ ఇన్స్యూరెన్స్ ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కొరకు గత తొమ్మిదేళ్ళుగా మెడిక్లెయిమ్ అమలు చేస్తూ ఉంది. ఈ పాలసీ క్రింద ప్రతి యేడాది జర్నలిస్టు కుటుంభానికి లక్ష రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది. జర్నలిస్టుతో పాటు భార్య, ఇద్దరు పిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుంది. మెడిక్లెయిమ్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా క్రింద ప్రతి జర్నలిస్టుకు 2/3 వంతు మొత్తాన్ని భరిస్తుంది. మిగిలిన 1/3 లబ్దిదారుడు భరించాలి. రెన్యువల్ కొరకు ధరఖాస్తు తో పాటు అక్రిడియేషన్, పాత I-Care, GHPL కార్డు జిరాక్సు లను జత చేయాలి. . కొత్త గా ధరఖాస్తు చేసే వారు విడివిడిగా కుటుంభ సభ్యుల పాస్ పోర్టు పోటోలను ఒకటి దరఖాస్తు పై అంటించి మరొకటి జత చేయాలి. గత సంవత్సరం దరఖాస్తు పత్రాలను జర్నలిస్టు సంఘాలు, డి పి ఆర్ ఓ కార్యాలయాల ద్వారా పంపు కోవచ్చు.హైదరాబాద్ జర్నలిస్టులు హెచ్ యు జె కార్యాలయంలో నగదు, దరఖాస్తులు అందించి రసీదు పొందవచ్చు. జిల్లాలకు చెందిన జర్నలిస్టులు APWJF జిల్లా కమిటీల ద్వారా పంపవచ్చు. దరఖాస్తు పత్రాల డౌన్ లోడ్ కు దిగువన క్లిక్ చేయండి.

 

FRESH ( UNITED )

RENEVAL ( UNITED )

FRESH, RENEVAL ( NATIONAL )

APWJF కార్యాలయ చిరునామా:

ANDHRA PRADESH WORKING JOURNALISTS FEDARATION (APWJF)

                              202,Surabhi Saffire, Golconda'X'Roads,

                        Musheerabad,HYDERABAD-500020

                              Phone: 040-27671067 Mob:98663-99883


APWJF ACCOUNT NUMBER:

62050019363

SBH RTC 'X'Roads Branch

Hyderabad

 Journalists Maha Pradarshana
Fri, 28 Jun 2013 02:05:00 +0000


 • కదం తొక్కిన కలం కార్మికులు 
 • హైదరాబాద్ లో జర్నలిస్టుల మహా ప్రధర్శన

   

------------------------------------------------------------------------------------------------------------------------

 • జర్నలిజం తోనే విజ్ఞానం, వెలుగు : నాయిని నర్సింహారెడ్డి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎపిడబ్ల్యుజె ఎఫ్) ఆద్వర్యంలో జూన్ 26న బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు జర్నలిస్టులు మహా ప్రదర్శన జరిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది జర్నలిస్టులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. గ్రామీణ విలేకరులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,ఇళ్ళస్థలాలు కేటాయించా లని, జర్నలిస్టులకు చట్టబద్దమైన రక్షణ కల్పించాలని ప్రధర్శనలో నినదించారు. సమాఖ్య అద్యక్షుడు బసవ పున్నయ్య,ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు కార్యదర్శులు సంజీవరెడ్డి,సత్యనారాయణ,కోటేశ్వర్ రావు,సోమయ్య, ఉపాద్యక్షులు జి.శ్రీనుబాబు,ఎ.శేఖర్, ,కె.వేణు గోపాల్, సమాఖ్య జాతీయ సమన్యయ కమిటీ సభ్యులు ఎ.అమరయ్య,కె.మంజరి,పి.ఆనందం కోశాధికారి ఆర్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు నుంచి ప్రారంబమైన ప్రధర్శన వీఎస్టీ,ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, ఇందిరా పార్క్ చౌరస్తాల మీదుగా ధర్నాచౌక్ వరకు సాగింది. అనంతరం దర్నాచౌక్ లో సమాఖ్య అధ్యక్షుడు బసవ పున్నయ్య అద్యక్షతన జరిగిన సభలో హెచ్ ఎం ఎస్ నాయకుడు , టిఆర్ ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, టిఎన్ టియుసి నాయకుడు రాంబాబు పాల్గొని జర్నలిస్టులకు మద్దతు పలికారు.

         ఈ సందర్భంగా నాయిని నర్శింహారెడ్డి మాట్లాడుతూ జర్నలిజం ఉంటేనే ప్రపంచానికి విజ్ఞానం, వెలుగు ఉంటాయన్నారు. సమాజంలో డబ్బు, హోదా లేకుంటే విలువలేని పరిస్థి నెలకొందని, విలువలతో కూడిన జర్నలిజాన్ని నిలబెట్టాలన్నారు.సమాజం వక్రమార్గంలో నడవకుండా సక్రమమైన మార్గంలో నడిపించేది జర్నలిస్టులేనని చెప్పారు. నాయకులను తీర్చిదిద్దే శక్తితో పాటు వారిని పడగొట్టే యుక్తి జర్నలిస్టులకు ఉందన్నారు. అవినీతిపరులను నిలదీస్తున్న జర్నలిస్టులు నీతిమంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా సమస్యలపై పోరాటం సాగించే వారికి జర్నలిస్టులు మద్దతుగా నిలవాలన్నారు.

      అంకితభావంతో పనిచేస్తూ యాజమాన్యాల ప్రతిష్టను పెంచుతున్న జర్నలిస్టుల విలువను పెంచటంలో యాజమాన్యాలు ముందుకు రాకపోవటం దురదృష్టకరమన్నారు.పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని, సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి హెచ్ ఎం ఎస్ , టిఆర్ ఎస్ ల సంపూర్న మద్దతు ఉంటుందన్నారు. టిఎన్ టియుసి నాయకులు రాంబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఆలోచన చేయలేని స్థితిలో ప్రభుత్వముందని, ఇది చాలా దుర్మార్గమన్నారు. జర్నలిస్టులకు 60గజాల స్థలం ఇవ్వలేని ప్రభుత్వం ఏ విధంగా పని చేస్తుందో మనకర్ధమవుతుందన్నారు. ఈ ప్రభుత్వానికి ఏ సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. డిమాండ్ ల సాధన కోసం జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి టిఎన్ టియుసిసంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సమాఖ్య జాతీయ సమన్యయ కమిటీ సభ్యులు అమరయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు జస్టిస్ గురుభక్ష్ మతీజియా సిపార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

నిజమైన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమాఖ్య పోరాటం చేస్టుదన్నారు. జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో ఐ&పిఆర్ , డిపిఆర్వో కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్దమవుతామన్నారు. ఎపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల కన్నా అధ్వాన్నంగా నేడు కలం కార్మికులు బతకాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సేవ చేసే వారికి రాయితీలు ఇచ్చే ప్రభుత్వం వారిని విశ్లేశించే జర్నలిస్టుల సమస్య లపై దృష్టి ఎందుకు సారించదని ప్రశ్నించారు. సమాఖ్య జాతీయ సమన్యయ కమిటీ సభ్యురాలు మంజరి మాట్లాడుతూ అభద్రతా భావంతో పనిచేయాల్సిన దుస్తితి జర్నలిస్టులకు ఏర్పడిందన్నారు. కనీస వేతన చట్టం లేకపోవటం దుర్మార్గమన్నారు. మీడియా సంస్థల్లో లైంగిక వేదింపుల నిరోధక కమీతీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో జర్నలిస్టుల కొరకు ప్రభుత్వం నియమించే అన్ని కమిటీల్లో ఫెడరేషన్ కు స్థానం కల్పించాలన్నారు. జర్నలిస్టులందరికి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని, సభ్ ఎడిటర్లకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. సమాఖ్య కార్యవర్గ సభ్యురాలు శాంతి, హెచ్ యు జె కార్యదర్శి ఎఱం నర్సింగ్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఇ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 


APWJF Deligates Meet I&PR Commissioner
Sat, 27 Apr 2013 19:00:00 +0000

పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాలి

------------------------------------------------------------------------

 • సమాచారశాఖ కమిషనర్‌కు ఎపిడబ్ల్యూజెఎఫ్‌ వినతి


రాష్ట్రంలోని పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య (ఎపిడబ్ల్యూజెఎఫ్‌;) సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ దాన కిశోర్‌ను కోరింది. ఈ మేరకు సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి బసవ పున్నయ్య, జి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆ సమాఖ్య ప్రతినిధులు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఫెడరేషన్‌ నిర్వహించబోయే కార్యాచరణ, అందుకు సంబంధించి ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన మహాసభలో చేసిన తీర్మానాలు, ఇతర డిమాండ్లతో కూడిన పత్రాన్ని వారు కమిషనర్‌కు అందజేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, మెడిక్లైయిమ్‌, ఇతర సంక్షేమ పథకాలను తక్షణమే అమల్జేయాలని కోరారు. ప్రభుత్వ వైపు నుండి వేసే అన్ని కమిటీల్లో ఎపిడబ్ల్యుజెఎఫ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రతినిధుల వినతికి స్పందించిన కమిషనర్‌..సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎ రవూఫ్‌, కార్యదర్శి మామిడి సోమయ్య, జాతీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అమరయ్య, కె మంజరి తదితరులు ఉన్నారు.

APWJF Elect New Excutive Committe
Wed, 17 Apr 2013 13:25:00 +0000
 • ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక


 • అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బసవపున్నయ్య, ఆంజనేయులు


విశాఖపట్నంలో నిర్వహించిన ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ద్వితీయ మహాసభలో ప్రతినిధులు ఆదివారం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి.బసవపున్నయ్య, జి.ఆంజనేయులు ప్రత్యక్ష ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎ.శేఖర్‌ ( చిత్తూరు ) , ఎంఎ రవూఫ్‌ ( హైదరాబాద్‌)  కె.వేణుగోపాలరావు ( శ్రీకాకుళం) , వి.జగన్‌ ( వరంగల్‌ ) , కార్యదర్శులుగా గంట్ల శ్రీనుబాబు ( విశాఖపట్నం ) , బి.మధుసూదనరావు ( నెల్లూరు ) , పి.సంజీవరెడ్డి (కరీంనగర్‌ ) , కె.సత్యనారాయణ ( తూర్పుగోదావరి ) , ఎం.కోటేశ్వరరావు ( హైదరాబాద్‌ ) , ఎం.సోమయ్య ( హైదరాబాద్‌ ) ,  కె.శ్రీనివాస్‌ ( కృష్ణా ) , కోశాధికారిగా ఆర్‌.వెంకటేశ్వర్లు ( హైదరాబాద్‌ ) , కార్యవర్గసభ్యులుగా ఎ.రామకృష్ణ, కె.శ్రీనివాస్‌, వి.నవీన్‌రాజు, రంగు రాజయ్య, ఎంవిఎస్‌ నాగరాజు, కెబిజి తిలక్‌, సిహెచ్‌ మహేంద్ర, జి.నరసింహరావు, మేకల కృష్ణ, ఎస్‌.భాస్కరరావు, బి.నాగేంద్రప్రసాద్‌, ఓ.శాంతి ఎన్నికయ్యారు. కార్యవర్గ పదవులన్నింటినీ మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది

Vizag mahasabha Resolutions
Wed, 17 Apr 2013 13:15:00 +0000
 • జర్నలిస్టుల సమస్యలపై రాజధానిలో ూన్ లో  మహా ప్రదర్శన


 •     మేలో జిల్లాల్లోనూ ప్రదర్శనలు
 •     ఎపిడబ్ల్యుజెఎఫ్‌ తీర్మానం


రాష్ట్రంలోని వర్కింగ్‌ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ జూన్‌లో రాజధానిలోనూ, మేలో జిల్లాల్లోనూ మహా ప్రదర్శనలు నిర్వహించాలని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర ద్వితీయ మహాసభ తీర్మానించింది. సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టాలని సభ నిర్ణయించింది. విశాఖలోని విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మహాసభ తీర్మానాలను ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.బసవపున్నయ్య, జి.ఆంజనేయులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని జర్నలిస్టు సంఘాలతోనూ, జాతీయ స్థాయిలోని సంఘాలతోనూ సౌహార్థ సంబంధాలు కొనసాగించేందుకు వీలుగా ఫెడరేషన్‌కు చెందిన ఐదుగురితో జాతీయ సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంఘంలో సభ్యులుగా పి.పరమేశ్వరరావు, పి.ఆనందం, ఎం.కోటేశ్వరరావు, కె.మంజరి, ఎ.అమరయ్య ఉంటారని చెప్పారు. బ్రాడ్‌కాస్ట్‌ రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులను సంఘటిత పరిచేందుకూ, వారి సమస్యలపై పనిచేసేందుకూ వీలుగా కమిటీని మహాసభ ఎన్నుకుందని తెలిపారు. ఈ కమిటీకి గౌరవాధ్యక్షులుగా స్టూడియో-ఎన్‌ సిఇఓ టి.రాజేంద్ర, అధ్యక్షులుగా పి.పరమేశ్వరరావు, కార్యదర్శిగా వరకాల మురళీకృష్ణ వ్యవహరిస్తారు.

పలు తీర్మానాలు

కేరళ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా రాష్ట్రాలకంటే మెరుగైన రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టి, అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించినట్లు తెలిపారు. 'పెన్షన్‌ పథకంపై అధ్యయనం కోసం ఉన్నతస్థాయి అధికారులు, జర్నలిస్టుల ప్రతినిధులతో కూడిన కమిటీని నియమించాలి. ప్రింట్‌ మీడియాలో పబ్లికేషన్‌ సెంటర్లు ఉన్నచోట కాంట్రాక్టు పద్ధతిలో చేపడుతున్న నియామకాల వల్ల, ఎలక్ట్రానిక్‌ మీడియాలో జర్నలిస్టుల నియామకాలకు సంబంధించి షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని అమలు చేయడం వల్ల ఉద్యోగ భద్రత లేని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీడియా కమిషన్‌ను అమలు చేయాలి. జర్నలిస్టులు, ఇతర సిబ్బందికి కొత్త వేతనాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి త్రైపాక్షిక కమిటీలను సమావేశ పర్చి యాజమాన్యాలు కొత్త వేతనాల అమలుకు తగిన చర్యలు గైకొనాలి. మహిళా ఉద్యోగులు అధికంగా ఉన్న సంస్థలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి. వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టపరిధిలో రిపోర్టర్లతో పాటు డెస్క్‌లో పనిచేసే సబ్‌ఎడిటర్లకూ అక్రిడేషన్లు మంజూరుచేయాలని తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీలో ఎపిడబ్ల్యుజెఎఫ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలి. విధి నిర్వహణలో జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టుకూ రైల్వేపాస్‌ వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎం.కోటేశ్వరరావు, ఎం.సోమయ్య, కె.మంజరి పాల్గొన్నారు.

Journalists Services Extrardinary
Wed, 17 Apr 2013 13:05:00 +0000
 • జర్నలిస్టుల సేవలు నిరుపమానం


 • జివిఎంసి కమిషనర్‌ సత్యనారాయణ


జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవలు నిరుపమానమని జివిఎంసి కమిషనర్‌ ఎంవి సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ ద్వితీయ రాష్ట్ర మహాసభలు ఎయులో రెండో రోజు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని జర్నలిస్టులు నవసమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ, అంబేద్కర్‌ దేశానికి చేసినసేవలు మరువరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు పింఛను పథకం అమలు చేయాలని, ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని, కనీసవేతనాలు చెల్లించాలని, మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రూరల్‌ జర్నలిస్టులకు రైల్వే పాస్‌లు, జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నవారందరికీ ఎసి బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించాలని కోరారు. దీనికోసం జిల్లాలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. డిమాండ్ల సాధనకై జూన్‌లో హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు.. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ప్రగతికి, జాతీయ స్థాయిలో తగిన ప్రాతినిధ్యం సంపాదించడం, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లు పరిష్కరించుకోవడం, ఈ విషయంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నూతన కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తామని చెప్పారు. మహాసభ విజయవంతమయ్యేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబును, మహాసభను జయప్రదం చేసేందుకు చేయూతనిచ్చిన జర్నలిస్టుల మిత్రులందరికీ మహాసభ ఆహ్వానసంఘం జ్ఞాపికతో సన్మానించింది. నూతన కార్యవర్గాన్ని సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.బసవపున్నయ్య, ఇతర నాయకులు తులసీదాసు, పరమేశ్వరరావు, కోటేశ్వరరావు, సోమయ్య, వేణుగోపాల్‌, వెంకటేశ్వరరావు, ఆనందం, తిలక్‌, ఆహ్వాన సంఘం సమన్వయకర్త, ఎన్‌.బ్రహ్మానందం, సీనియర్‌ జర్నలిస్టు ఆర్‌.బాబూరావు, నగర శాఖ అధ్యక్షకార్యదర్శులు పి.నారాయణ్‌, పియుఎస్‌ భాస్కర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డి.రవికుమార్‌, కోశాధికారి ఆర్‌. నాగరాజుపట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు

Vijaz Mahasabha
Tue, 16 Apr 2013 15:55:00 +0000

చట్టపరిధిలోకి ఎలక్ట్రానిక్‌ మీడియా 


 •    పింఛన్‌ సదుపాయంపై మాట్లాడతా
 • ఎపిడబ్ల్యుజెఎఫ్‌ మహాసభల్లో మంత్రి కృపారాణి

1956 చట్టపరిధిలోకి ఎలక్ట్రానిక్‌ మీడియాను చేర్చే అంశంపై అధ్యయనం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీశాఖ సహాయమంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌;) ద్వితీయ మహాసభలను ఆంధ్రాయూనివర్శిటీ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అసెంబ్లీ హాల్‌లో శనివారం జ్యోతి వెలిగించి, ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పత్రికలు, ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవాలకు విరుద్ధంగా అప్పుడప్పుడు ఉంటున్నాయని, దీనివల్ల మీడియాపై విశ్వసనీయత తగ్గడమేకాక కొన్ని అనర్థాలు జరుగుతున్నాయని అన్నారు. అశ్లీల దృశ్యాలు, డాన్సులు, పబ్‌ల గురించి ఎలక్ట్రానిక్‌ ఛానల్స్‌లో చూపించే బదులు, మానవతా విలువలను పెంపొందించే అంశాలపై ప్రచారం చేయాలని కోరారు. జర్నలిస్టులకు పెన్షన్‌ సదుపాయం కొన్ని రాష్ట్రాల్లో ఉందని, మన రాష్ట్రంలోనూ ఇటువంటి సదుపాయం ఉండాలని అన్నారు. ఇందుకోసం జర్నలిస్టుల సంఘాలు పోరాడితే వారికి అండగా తానుంటానని, ఈ విషయమై ముఖ్యమంత్రితోనూ, అవసరమైతే ప్రధానమంత్రితోనూ మాట్లాడతానని హామీ ఇచ్చారు.

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ, సమాజంలో మంచి కోరి పనిచేసే వారిని ప్రోత్సహించే విధంగా పత్రికల్లో వార్తలు ఉండాలని తెలిపారు. చెడు చేసేవారిపై విమర్శలూ ఉండాలని తెలిపారు. ప్రభుత్వ విప్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థలో పనిచేసేవారిపై విమర్శలు రావటం సహజమన్నారు. అటువంటి వాటిలోని నిజాలను తెలుసుకుని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలని తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ చెప్పేవారని గుర్తు చేశారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, యాజమాన్యాల కోసం జర్నలిస్టులు ఆత్మగౌరవాన్ని చంపుకోనవసరం లేదన్నారు.

ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రతను ప్రభుత్వం కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో చట్టపరంగా కలిగివున్న హక్కును జర్నలిస్టులకూ కల్పించాలన్నారు. బలహీనవర్గాలుగా జర్నలిస్టులను భావించి ఇళ్లస్థలాలూ, ఇతర సౌకర్యాలూ కల్పించాలని కోరారు. బీహారు, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పెన్షన్‌ సదుపాయం కల్పించాలన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా సహా మొత్తం మీడియాను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు. ప్రెస్‌ అకాడమీని విస్తృతపరిచి మీడియా అకాడమీగా మార్చాలని తెలిపారు.

శాసనమండలి ప్రోగ్రసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి వర్తించే సౌకర్యాలన్నీ జర్నలిస్టులకూ ఉండాలన్నారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ఆవిర్భావం చారిత్రక అవసరమన్నారు. ద్వితీయ మహాసభల నాటికే రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా అవతరించడం గొప్ప విషయమనీ, తృతీయ మహాసభల నాటికి రాష్ట్రంలో ఏకైక ప్రధాన సంఘంగా ఎదగాలనీ ఆకాంక్షించారు. సిపిఎం విశాఖజిల్లా కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, భారతదేశం మీడియా రంగంలోకి విదేశీ బహుళజాతి సంస్థలను అనుమతించడం వల్ల నాలుగైదు సంస్థల చేతుల్లోకి మీడియా వెళ్లే ప్రమాదముందని తెలిపారు. ఇటువంటి చర్యలను జర్నలిస్టులంతా ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. పత్రికా విలేకరులపై దాడులు జరిగే సమయంలోనూ, యాజమాన్యాలు అక్రమ లేఆఫ్‌లు ప్రకటించినప్పుడు సిపిఎం జర్నలిస్టులకు అండగా నిలిచిందని, భవిష్యత్‌లోనూ ఈ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ప్రత్యేక అతిథి ఎయు వైస్‌ ఛాన్సలర్‌ జిఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని సరైనమార్గంలో నడిపించడానికి జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయకుమార్‌, ఎయు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రామ్మోహనరావు, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.బసవపున్నయ్య, తదితరులు పాల్గొన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. (  ప్రాశక్తి సౌజన్యంతో )

APWJF State Meet in VIZAG on April 13,14
Sun, 24 Mar 2013 15:35:00 +0000

ఏప్రిల్ 13, 14 తేదీల్లో విశాఖలో ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ద్వితీయ మహాసభ


మహా సభల బ్రోచర్‌, పోస్టర్‌ను ఆవిష్కరించిన ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (  ఎపిడబ్ల్యుజెఎఫ్‌  )రాష్ట్ర ద్వితీయ మహాసభ ఏప్రిల్‌ 13, 14 తేదీల్లో విశాఖ పట్నంలో జరగనుంది. ఆంధ్రా యూనివర్శిటీలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అసెంబ్లీ హాల్‌లో నిర్వహించనున్న మహా సభల బ్రోచర్‌నూ, పోస్టర్‌నూ విశాఖలో మార్చి 23న( శనివారం ) ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రారంభ సభకు కేంద్ర మంత్రులు కిశోర్‌చంద్రదేవ్‌, దగ్గుబాటి పురంధేశ్వరి, డాక్టర్‌ కిల్లి కృపారాణి, రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి, రాష్ట్ర మంత్రులు పి.బాలరాజు, గంటా శ్రీనివాసరావు, ధర్మాన ప్రసాదరావు, శాసన మండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌లీడర్‌ ఎంవిఎస్‌ శర్మ హాజరవుతారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించామనీ, ఆయన కార్యక్రమం ఖరారు కావాల్సి ఉందనీ తెలిపారు.

మహాసభలో భాగంగా 'ఛేంజింగ్‌ రోల్‌ ఆఫ్‌ మీడియా- రెస్పాన్స్‌బులిటీ' అంశంపై సెమినార్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. మీడియా స్వభావం బాగా మారిందన్నారు. 'మారిన పరిస్థితుల్లో జర్నలిస్టుల బాధ్యత ఎలా ఉండాలి? వృత్తిపరంగా మెరుగైన స్థితికి జర్నలిస్టులు ఎలా చేరుకోవాలి?' అంశాలపై అభిప్రాయ సేకరణ జరగాల్సి ఉందని తెలిపారు. ప్రింట్‌ మీడియాకూ, ఎలక్ట్రానిక్‌ మీడియాకూ వేర్వేరుగా చట్టాలున్నాయనీ, పనిగంటల్లోనూ, వేతనాల్లోనూ తేడాలున్నాయనీ పేర్కొన్నారు. మీడియాలో పని పరిస్థితి, ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారాయన్నారు. జర్నలిస్టులపై దాడులు పెరుగుతు న్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు చట్టపరంగా ఉన్న రక్షణ జర్నలిస్టులకు కూడా కల్పిస్తే మరింత స్వేచ్ఛగా విధులు నిర్వహించగలరనీ, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ కోరారు. పొరుగునున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వలే మన రాష్ట్రంలోనూ జర్నలిస్టులకు పెన్షన్‌ సదుపాయం కల్పిం చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. మహాసభలో నూతన కార్యవర్గం ఏర్పాటుపై చర్చ జరుగుతుందన్నారు.

Reconstitution of the Tripartite Committee
Sat, 19 Jan 2013 07:50:00 +0000

ట్రై పార్టీ కమిటీలో APWJF కు ప్రాతినిద్యం కల్పిస్తూ ఉత్తర్వులు


వర్కింగ్ జర్నలిస్టుల చట్టం - 1955 ప్రకారం మీడియా సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, యాజమాన్యాల మద్య తలెత్తే వివాదాల పరిష్కారానికి మరియు వేతన బోర్డు సిపార్సుల అమలు, పర్య వేక్షించే Tripartite Committee ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్దరించింది. ఈ కమిటీలో నూతనంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ( APWJF )కు ప్రాతినిధ్యం  కల్పిస్తూ లేబర్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్ మెంట్ జీఓ నెం; 50 జారీ చేసింది. ఈ కమిటీ కాలపరిమితి మూడేళ్ళు.   కమీషనర్ ,లేబర్ చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో కన్వీనర్ గా అసిస్టెంట్ కమీషనర్ ,లేబర్ వ్యహరిస్తారు. సమాచార,పౌర సంబందాల శాఖ కమీషనర్ తో పాటు యాజమాన్యాల నుంచి నలుగురు           ( కె.మురళీకుమార్, ఆంధ్రజ్యోతి, టి.సూర్యం, దక్కన్ క్రానికల్, ఎం.సుజాత్ అలీ , సియాసత్, కె. ఎస్. ప్రభాకర్, ఇండియన్ ఎక్స్ ప్రెస్;) , జర్నలిస్టు సంఘాల తరపున 9 మంది ( ఎపిడబ్ల్యుజె ఎఫ్, జాప్ , ఎ.పి. న్యూస్ పేపర్స్ ఎంప్లాయిస్ పెడరేషన్ , నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున, ఐజెయు నుంచి ఇద్దరు, ఎపిడబ్ల్యుజె  నుంచి ముగ్గురు ) సభ్యులుగా నియమితులయ్యారు. 2011 లో ఈ కమిటీ పునరుద్దరణకు,  కమిటీలో  ప్రాతిని ద్యం  కొరకు APWJF ఆందోళన నిర్వహించిన విషయం విదితమే.rssfeedwidget.com